డబ్బులను స్విస్ బ్యాంకులోనే ఎందుకు దాచిపెడుతారు...?

by Dishanational1 |
డబ్బులను స్విస్ బ్యాంకులోనే ఎందుకు దాచిపెడుతారు...?
X

దిశ, వెబ్ డెస్క్: చాలామంది ప్రముఖులు తమ డబ్బును స్విస్ బ్యాంకులో దాచిపెడుతారు అనే మాట అప్పుడప్పుడు వింటుంటాం. అయితే, ఈ విషయంలో చాలామందికి ఓ డౌట్ ఉంటుంది. అదేమంటే... స్విస్ బ్యాంకులోనే ఎందుకు దాచిపెడుతారు.. అందులో దాచిపెడితే లాభం ఏంటి... అదేవిధంగా అందులో దాచిపెడితే బయటికి తెల్వదా? ఇలా అనేకరకాలుగా డౌట్స్ వస్తుంటాయి. ఇందుకు సంబంధించి ప్రముఖులు చెప్పినదాని ప్రకారం... స్వీస్ బ్యాంకులో డబ్బులను జమ చేస్తే ట్యాక్స్ తక్కువగా ఉంటుందని.. మరో విషయమేంటంటే... ప్రైవసీ. ఇది స్విస్ లా ప్రకారం.. స్విస్ బ్యాంక్ తమ కస్టమర్ల డిటెయిల్స్ ను ఎప్పుడూ కూడా బయటపెట్టదు. మరో రీజన్ ఏంటంటే... స్విస్ బ్యాంక్ తమ కస్టమర్లకు ఓ సీక్రెట్ కోడ్ ను ఇస్తుంది. ఈ కోడ్ ను ఉపయోగించే కస్టమర్ యొక్క అకౌంట్ ను యాక్సెస్ చేయగలదు. సో... అందువల్ల గవర్నమెంట్స్ కానీ, ఇతరులకు కానీ స్విస్ బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్స్ డీటెయిల్స్ తెలుసుకోవడం ఇంపాజిబుల్. అందుకే స్విస్ బ్యాంకులో డబ్బులను జమ చేస్తారు అని వారు చెబుతున్నారు.







Next Story

Most Viewed