పెళ్లి కాకున్నా పిల్లల్ని కంటానంటే మాకు ఓకే...

by Dishanational1 |
పెళ్లి కాకున్నా పిల్లల్ని కంటానంటే మాకు ఓకే...
X

దిశ, వెబ్ డెస్క్: చైనా దేశంలోని సిచవాన్ ప్రావిన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్కడ పెళ్లికాని వారు కూడా చట్టబద్ధంగా పిల్ల్ని కలిగి ఉండటానికి వెసులుబాటు కల్పించి వివాహితులు ఏ విధంగానైతే పొందే ప్రయోజనాలన్నీ వారికి అందుతాయని పేర్కొంది. ఈ నూతన విధానం ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటివరకు వివాహితులు మాత్రమే చట్టబద్ధంగా పిల్లలకు జన్మనివ్వడానికి అనుమతి ఉండేది. అయితే, ఇకపై వివాహం కాని ఒంటరి వ్యక్తులు పిల్లలు కావాలనుకుంటే సంబంధిత అధికారుల వద్ద రిజిస్టర్ చేసుకోవొచ్చు. అదేవిధంగా సంతానం సంఖ్య విషయంలోనూ ఎలాంటి పరిమితి ఉండబోదు. ఈ నిర్ణయం వెనుక ముఖ్య కారణమేమిటో కూడా సిచువాన్ ఆరోగ్య కమిషన్ పేర్కొన్నది.


Next Story

Most Viewed