నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ఘన నివాళి ఇచ్చిన సింగపూర్

by Disha Web Desk 17 |
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ఘన నివాళి ఇచ్చిన సింగపూర్
X

న్యూఢిల్లీ: సింగపూర్ ప్రభుత్వం నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ఘన నివాళి ఇచ్చింది. ఆయన 1943లో 'ఢిల్లీ చలో' నినాదం ఇచ్చిన సింగపూర్‌లోని పాదాంగ్ ప్రాంతానికి మంగళవారం స్మారక గుర్తింపును ఇస్తున్నట్లు ప్రకటించింది. సింగపూర్ తన 57వ జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున 75వ జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించింది. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనున్న భారత్‌కు ఇది గర్వించదగ్గ విషయం.

కాగా, పాదాంగ్ 1800 నుంచి ఉపయోగంలో ఉన్న పురాతనమైన బహిరంగ ప్రాంత మైదానాలలో ఒకటిగా ఉంది. దీనిని క్రికెట్, ఫుట్ బాల్, హాకీ, టెన్నిస్, లాన్ బౌలింగ్ వంటి క్రీడలకు ఉపయోగిస్తున్నారు. ఈ అరుదైన గుర్తింపు ద్వారా పాదాంగ్‌‌ను ఇప్పటినుంచి స్మారకాల పరిరక్షణ చట్టం ప్రకారం సంరక్షిస్తామని నేషనల్ హెరిటేజ్ బోర్డు తెలిపింది.

సింగపూర్‌లోని భారత్ కమ్యూనిటీకి పాదాంగ్‌తో ప్రత్యేకత సంబంధం ఉందని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ దక్షిణాసియా స్టడీస్ హెడ్ రాజేష్ రాయ్ అన్నారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఐ)కు ఇది చారిత్రక గుర్తింపు అని తెలిపారు. బ్రిటీష్ వారు ద్వీపంలో తమ అవుట్‌పోస్టును స్థాపించినప్పుడు భారతీయ సిపాయిలు మొదట తమ క్యాంపు సైట్‌లను ఇక్కడే స్థాపించారని చెప్పారు. అంతేకాకుండా పలు కీలక సంఘటనలకు ఇది వేదికైంది.



Next Story