- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Shigeru Ishiba: జపాన్ నూతన ప్రధానిగా షిగేరు ఇషిబా ప్రమాణ స్వీకారం
దిశ, వెబ్‌డెస్క్:జపాన్(Japan) నూతన ప్రధానిగా(New Prime Minister) మాజీ రక్షణశాఖ మంత్రి షిగేరు ఇషిబా(Shigeru Ishiba) మంగళవారం ప్రమాణ స్వీకారం(Oath Taking) చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ.. జపాన్ దేశ భద్రత చాలా బలహీనంగా ఉందని,దేశ రక్షణను మరింత బలంగా తీర్చదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. దేశంలో శాంతి స్థాపనకు, చైనాను అడ్డుకునేందుకు మిత్ర దేశాలతో కలిసి ముందుకు వెళ్తానని ప్రకటించారు.ఇషిబాతో మరో 19 మంది మంత్రులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా గత శుక్రవారం లిబరల్ డెమోక్రటిక్ పార్టీ(LDP) అధ్యక్షుడిగా 67 ఏళ్ల షిగేరు ఇషిబా ఎన్నికైన విషయం తెలిసిందే.ఈ ఎన్నికల్లో ప్రధాని పదవి కోసం 9 మంది LDP నేతలు పోటీ పడగా మెజారిటీ నాయకులు షిగేరు ఇషిబా అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపారు.దీంతో ఆయన జపాన్ 102వ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.ఇషిబా కెరీర్ ఆరంభంలో బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు. 29 ఏళ్ల వయసులో 1986లో తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ప్రభుత్వ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ తరచూ వార్తల్లో నిలిచేవారు. గత ఎల్‌డీపీ ప్రభుత్వంలో ఆయన రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు.