- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Russia - Ukraine War : రష్యాను చావుదెబ్బ కొట్టిన ఉక్రెయిన్..!
దిశ, వెబ్‌డెస్క్ : ఉక్రెయిన్-రష్యాకు మధ్య గత రెండేండ్లకు పైగా యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఉక్రెయిన్‌పై ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చిన రష్యా ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోంది. ఈ యుద్ధంలో రష్యాకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి రష్యాకు ఉక్రెయిన్‌ను నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. యుద్ధం ప్రారంభంలో రష్యా బలగాలు ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి దాడులకు పాల్పడగా.. ఇప్పుడు ఉక్రెయిన్ బలగాలు కూడా అదే ఫార్ములా పాటిస్తున్నారు. కాగా ఇటీవలే రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ బలగాలు చొచ్చుకు వెళ్లాయి. రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలోని దాదాపుగా 74 సెటిల్మెంట్లను ఉక్రెయిన్ బలగాలు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలోని 74 స్థావరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నామని, గత 24 గంటల్లో ఒకటి నుండి మూడు కి.మీల మేర రష్యా భూభాగాన్ని ఆక్రమించామని ఉక్రెయిన్ మంగళవారం తెలిపింది.
ఈ క్రమంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ.. "కీవ్ యొక్క దళాలు రష్యాలోని కొన్ని ప్రాంతాలను చుట్టుముట్టాయి ,ఆ ప్రాంతంలో తీవ్రమైన యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ, మా దళాలు ముందుకు సాగుతున్నాయి, కుర్స్క్ ప్రాంతంలోని దాదాపుగా 74 స్థావరాలు ఉక్రెయిన్ నియంత్రణలో ఉన్నాయని" చెప్పారు. తమ దేశ టాప్ కమాండర్ ఒలెక్సాండర్ సిర్‌స్కీతో జెలెన్స్కీ ఓ వీడియో లింక్ ద్వారా మాట్లాడుతూ.. "ఆపరేషన్‌లో తదుపరి కీలక దశలను వెంటనే మొదలుపెట్టాలని" చెప్పాడు. ప్రతిదీ ప్రణాళిక ప్రకారంగానే జరుగుతుందని సిర్స్కీ జెలెన్స్కీకి బదులిచ్చాడు. రష్యా భూభాగాన్ని ఉక్రెయిన్ తమ ఆధీనంలోకి తీసుకున్న క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. కుర్స్క్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ బలగాలు విడిచిపెట్టకపోతే కీవ్‌పై మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించారు. రష్యా యొక్క సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేల ఉక్రెయిన్ ప్రయత్నిస్తే తగిన జవాబిస్తామని స్పష్టం చేశారు. అయితే .. ఉక్రెయిన్ బలగాల చొరబాటును రష్యా ఊహించలేదని సమాచారం.దీంతో కుర్స్క్ ప్రాంతంలో కీవ్ బలగాలను అడ్డుకొనేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ దళాలు ఇంకా ముందుకు రాకుండా అడ్డుకొనేందుకు అధిక బలగాలను కుర్స్క్ రీజియన్‌కు తరలిస్తున్నారు .