ఉక్రెయిన్ 4 ప్రాంతాలు రష్యాలో అధికార విలీనం..

by Disha Web |
ఉక్రెయిన్ 4 ప్రాంతాలు రష్యాలో అధికార విలీనం..
X

మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా స్వాధీనంలో చేసుకున్న ఉక్రెయిన్ భూభాగాలను అధికారికంగా తమ దేశంలో కలుపుతామని చెప్పారు. శుక్రవారం కొత్త ప్రాంతాలను తమ భూభాగంలో కలిపే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. దీనిలో రష్యా అధినేత పుతిన్ మాట్లాడుతారని చెప్పారు.

ఫిబ్రవరిలో ప్రత్యేక మిలటరీ అపరేషన్ చేపట్టిన రష్యా, ఉక్రెయిన్ లోని లుహన్స్క్, డొనెట్స్క్, ఖేర్సాన్, జాపోరిజ్జియా ప్రాంతాలను సైన్యం అధీనంలో ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాలలో రష్యా అభిప్రాయసేకరణ చేపట్టింది. ఈ ప్రాంతాల్లోని నివాసితులు రష్యాలో చేరడానికి మద్దతు ఇచ్చారని అధికారులు తెలిపారు.

ఉక్రెయిన్ నుండి క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా స్వాధీనం చేసుకున్న ఎనిమిది సంవత్సరాల తరువాత ఈ ప్రకటన వెలువడింది. అయితే రష్యా ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని పాశ్చాత్య దేశాలు హెచ్చరించాయి. దీనిని గుర్తించమని జీ7 దేశాలు పేర్కొన్నాయి. మరోవైపు ఉక్రెయిన్ తమకు సాయం చేసేందుకు సైన్యం కావాలని ప్రపంచ దేశాలను కోరింది.

Next Story

Most Viewed