ఐఎస్ఎస్‌లో కొనసాగనున్న రష్యా.. చర్చల్లో స్పేస్ ఏజెన్సీ..

by Disha Web Desk 14 |
ఐఎస్ఎస్‌లో కొనసాగనున్న రష్యా.. చర్చల్లో స్పేస్ ఏజెన్సీ..
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ స్పేస్ స్టేష్ నుంచి తప్పుకుంటామని, తమ సొంత స్పేస్ స్టేషన్‌ను సిద్దం చేసుకుంటున్నామని రష్యా వెల్లడించింది. అంతేకాకుండా ఐఎస్ఎస్ నుంచి తప్పుకునేందుకు డెడ్‌లైన్ కూడా వెల్లడించింది. 2024 తర్వాత ఐఎస్ఎస్ నుంచి రష్యా వైదొలుగుతుందని, అప్పటికే తన సొంత స్పేస్ స్టేషన్‌ను అంతరిక్షంలోకి పంపిస్తుందని తెలిపింది. అయితే తాజాగా ఈ విషయంపై రష్యా స్పేస్ ఏజెన్సీ, దేశ అధికారులతో చర్చిస్తోందని సమాచారం. అంతేకాకుండా 2024 తర్వాత కూడా ఐఎస్ఎస్‌లో భాగస్వామ్యం కొనసాగించేందుకు మాస్కో ఆలోచిస్తుందని ప్రముఖ వార్తా సంస్థ తన నివేదికలో పేర్కొంది.

ఐఎస్ఎస్‌లో 2024 తర్వత కూడా పాల్గొనడంపై రష్యా స్పేస్ ఏజెన్సీ ప్రభుత్వంతో చర్చలు చేస్తోందని, మరో ఏడాది కూడా ఐఎస్ఎస్‌తో కలిసి ఉండేలా నిర్ణయం రావాలని కోరుకుంటున్నానని రష్యా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్స్ హెడ్ సెర్గియో క్రికలెవ్ తెలిపారు. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం సందర్భంగా రష్యా ఐఎస్ఎష్ నుంచి తప్పుకుంటుందని, ఇప్పటికే సొంత స్పేస్ స్టేషన్ తయారుచేసుకోనున్నామని తెలిపింది. ఇప్పుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఆలోచనలో పడింది. మరి ఈ విషయంపై రష్యా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Next Story