సియోల్‌లో 115 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయి వర్షపాతం

by Disha Web Desk 17 |
సియోల్‌లో 115 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయి వర్షపాతం
X

సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో భారీ వర్షాలు అల్లకల్లోలం సృష్టించాయి. పెద్ద ఎత్తున వరదలు సంభవించడంతో రోడ్లు, ఇళ్లు, సబ్‌వేలు నీటితో నిండిపోయాయి. పలు ఘటనల్లో 8 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. వందల సంఖ్యలో నీటిలో మునిగాయి. మరి‌కొందరు గల్లంతైనట్లు పేర్కొన్నారు.

సోమవారం ఒక్కరోజులోనే సియోల్‌లో 422 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. గంటకు 141.5 మిల్లీమీటర్ల రికార్డు వర్షం కురిసిందని అధికారులు చెప్పారు. ముందు జాగ్రత్తగా నగరంలో లెవల్ 3 ఎమర్జేన్సీ హెచ్చరికలు జారీ చేశారు. 1907 తర్వాత ఇదే అత్యధిక వర్షపాతమని అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులతో సోమవారం రాత్రి భయానక పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.



Next Story