ఆధారాలు చూపండి.. యూఎస్‌కు రష్యా ఛాలెంజ్..

by Dishafeatures2 |
ఆధారాలు చూపండి.. యూఎస్‌కు రష్యా ఛాలెంజ్..
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం నుంచి ప్రపంచ వ్యాప్తంగా రష్యాపై వ్యతిరేకత పెరిగింది. అనేక దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు ఆయుధాలను పంపిణీ చేస్తే, మరికొన్ని మాస్కోపై తీవ్ర ఆంక్షలు విధించాయి. ఇదే క్రమంలో తాజాగా నార్త్ కొరియా నుంచి రష్యా ఆయుధాలను కొనుగోలు చేస్తోందని అమెరికా ఆరోపించింది. నార్త్ కొరియా నుంచి రాకెట్లు, ఆయుధాలను, ఇరాన్ నుంచి డ్రోన్‌లను కోనుగోలు చేసి వాటిని ఉక్రెయిన్‌పై వాడాలని రష్యా ప్లాన్ చేస్తోందని యూఎస్ తీవ్ర ఆరోపణలు చేసింది.

తాజాగా అమెరికా ఆరోపణలపై రష్యా యూఎన్ అంబాసిడర్ విసిలీ నెబెన్‌జియా స్పందించారు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో విసిలీ మాట్లాడారు. తాము ఆయుధాలను కొంటున్నట్లు ఆధారాలు చూపాలని ఆయన అమెరికాను కోరారు. 'ఈ ఆరోపణలకు తగిన ఆధారాలు చూపండి. లేకుంటే మీరు తప్పుడు సమాచారాన్ని ప్రకటిస్తున్న ఒప్పుకోండి' అని ఆయన కోరారు.

Also Read : UK కొత్త హోం సెక్రటరీగా గోవాకు చెందిన సుయెల్లా బ్రేవర్‌మాన్



Next Story