విమానం నడుపుతూ నిద్రపోయిన పైలెట్లు.. 25 నిమిషాల తర్వాత..

by Dishanational4 |
విమానం నడుపుతూ నిద్రపోయిన పైలెట్లు.. 25 నిమిషాల తర్వాత..
X

అడీస్ అబాబా: సుడాన్‌లోని ఖర్టౌమ్ నుంచి అడీస్ అబాబాకు బయలుదేరిన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్-737 విమానాన్ని నడుపుతున్న ఇద్దరు పైలెట్లు నిద్రపోయారు. దీంతో విమానం ల్యాండింగ్ మిస్ అయింది. ల్యాండింగ్‌కు చేరువవుతున్నా.. విమానం 37 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులు అప్రమత్తమయ్యారు. పైలెట్లకు కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నించినా వారు నిద్ర నుంచి మేలుకోలేదు. అయితే నిర్దిష్ట ఎత్తులో విమానం చేరుకున్నప్పుడు పైలెట్లు 'ఆటో పైలెట్ సిస్టమ్'ను ఆన్ చేస్తారు. ల్యాండ్ అవ్వాల్సిన రన్‌వే దాటిపోవడంతో ఆటో పైలెట్ సిస్టమ్ ఆఫ్ అయింది.దీంతో విమానంలో ఆలారమ్ మోగింది.

ఇవి కూడా చ‌ద‌వండి :

చిరుత పులి తోక‌ప‌ట్టుకు లాగిన వ్య‌క్తి.. ఆ త‌ర్వాత‌..?! (వీడియో)

అప్పుడు నిద్రలోనుంచి తేలుకున్న పైలెట్లు.. ఏటీసీ అధికారులను సంప్రదించారు. 25 నిమిషాల తర్వాత విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు ఏవియేషన్ హెరాల్డ్ వెల్లడించింది. విమానం ఎలా యూటర్న్ తీసుకుందో దానికి సంబంధించిన ఫోటోను ఏవియేషన్ సర్వియల్స్ సిస్టమ్ విడుదల చేసింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొంది. ఆ తర్వాత తదుపరి ఫ్లైట్‌ను 2.50 గంటల తర్వాత బయల్దేరడానికి అనుమతిచ్చింది. కాగా, ఇలాంటి ఘటనే మే నెలలో చోటు చేసుకుంది. న్యూయార్క్ నుంచి రోమ్ వెళ్తున్న విమానంలో కూడా పైలెట్లు నిద్రపోయారు.



Next Story

Most Viewed