ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌ 2022గా 'గోబ్లిన్ మోడ్'

by Disha Web Desk 17 |
ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌ 2022గా గోబ్లిన్ మోడ్
X

లండన్: ప్రతి ఏటా ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఎంపిక చేసే వర్డ్ ఆఫ్ ది ఇయర్‌ను వినూత్నంగా ఎంపిక చేసింది. చరిత్రలో తొలిసారిగా పబ్లిక్ ఓటింగ్ ద్వారా పదాన్ని నిర్ణయించింది. 'గోబ్లిన్ మోడ్' అనే పదాన్ని ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2022 గా ఎంపిక చేసింది. 'గోబ్లిన్ మోడ్' అనేది ఒక రకమైన ప్రవర్తనను వివరించడానికి ఉపయోగించే యాస పదం.

డిక్షనరీ ప్రకారం, సోమరితనం, మందబుద్ధి, అత్యాశ, సాధారణంగా సామాజిక నిబంధనలు లేదా అంచనాలను తిరస్కరించడం వంటి అర్థాలలో ఉపయోగిస్తారు. ఈ ఏడాదిలో ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగించారు. మరోవైపు తొలిసారిగా ఆక్స్‌ఫర్డ్ లాంగ్వేజ్ వార్షిక పదాన్ని ఓటింగ్ ద్వారా ఎన్నుకుంది.

డిక్షనరీ తయారీలో నిపుణులైన బృందం మూడు పదాలను తుది జాబితా చేసింది. మెటావర్స్, #ఐస్టాండ్‌విత్, గోబ్లిన్ మోడ్ పదాలు తుది ఎంపికలో నిలిచాయి. ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన ఓటింగ్‌లో 93 శాతం ఓటింగ్‌తో గోబ్లిన్ మోడ్ తొలిస్థానంలో నిలిచింది. 4 శాతం ఓట్లతో మెటావర్స్ రెండో స్థానంలో, ఐస్టాండ్‌విత్ చివరి స్థానంలో నిలిచింది. మరోవైపు అమెరికన్ డిక్షనరీ పబ్లిషర్ 'గ్యాస్ లైటింగ్' పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2022 గా ప్రకటించింది.



Next Story