పోలీస్ యూనిఫాంలో ఉండని చెక్ చెయ్యలే... లోపలకెళ్లి బాంబు పేల్చాడు

by Disha Web Desk 4 |
పోలీస్ యూనిఫాంలో ఉండని చెక్ చెయ్యలే... లోపలకెళ్లి బాంబు పేల్చాడు
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్‌లో పోలీస్ హెడ్ క్వార్టర్స్ మసీదులో ఇటీవల జరిగిన సూసైడ్ బాంబర్ పేలుడు ఘటనలో 101 మంది చనిపోయిన ఘటనలో కీలక విషయాలు వెలుగు చూశాయి. బాంబు దాడి సమయంలో దుండగుడు పోలీసు యూనిఫాం, హెల్మెట్ ధరించి ఉన్నడని పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ పెషవార్‌లోని నార్త్ వెస్ట్ సిటీలో సోమవారం బాంబు దాడి జరిగిన సమయంలో వందల కొద్ది పోలీసుల అధికారులు ప్రార్థనల్లో పాల్గొనగా బాంబు దాటికి గోడ అధికారులపై కూలినట్లు గుర్తించామన్నారు. పోలీసు డ్రెస్సులో ఉన్న దుండగున్ని అధికారులు గుర్తించలేకపోవడంతో ఇది సెక్యూరిటీ వైఫల్యమే అని మొజం జా అన్సారీ ఖైబర్ పక్త్యుంక్వా ప్రావిన్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.

సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి తలను గుర్తించామన్నారు. నిందితుడి వెనక పెద్ద నెట్ వర్క్ ఉన్నట్లు అన్సారీ తెలిపారు. ఈ దాడికి నిందితుడి ఒక్కడి ప్రమేయం లేదని ఆయన పేర్కొన్నారు. ఇంటలిజెన్స్, కౌంటర్ టెర్రరిజం బ్యూరో పక్కనే జరిగిన ఈ బాంబు దాడి ఘటనపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. అఫ్గానిస్తాన్ కాబుల్‌లో పాలనను తాలిబన్లు కైవసం చేసుకున్న తర్వాత పాకిస్థాన్‌లో జరిగిన అత్యంత ప్రమాదకరమైన బాంబు దాడి ఇదే అని ఆయన అన్నారు. కాంపౌడ్ వెలుపల ఎవరైనా సాధారణ ప్రజలు ఈ దాడికి సహాయ పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ దాడి ఘటన తర్వాత 23 మందిని అదుపులోకి తీసుకున్నామని, వీరిలో కొంత మంది అఫ్గాన్ సరిహద్దు ప్రాంతంలోని గిరిజనులు ఉన్నారని ఆయన తెలిపారు.


Next Story