Narendra Modi: 24 ఏళ్ల నాటి ఫోటోను మోడీకి బహుమతిగా ఇచ్చిన జమైకా ప్రధాని

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-01 15:41:46.0  )
Narendra Modi: 24 ఏళ్ల నాటి ఫోటోను మోడీకి బహుమతిగా ఇచ్చిన జమైకా ప్రధాని
X

దిశ, వెబ్‌డెస్క్:జమైకా ప్రధాన మంత్రి(Jamaica Prime Minister) ఆండ్రూ హోల్నెస్(Andrew Holness) నాలుగు రోజుల పర్యటన నిమిత్తం నిన్న భారతదేశాని(India)కి విచ్చేసిన సంగతి తెలిసిందే.ఈ పర్యటనలో వాణిజ్యం(Trade), పెట్టుబడుల(Investment)తో సహా పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)తో చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆండ్రూ హోల్నెస్ ఈ రోజు మోడీతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆండ్రూ హోల్నెస్ ప్రధాని మోడీకి ప్రత్యేకమైన జ్ఞాపికను కానుకగా ఇచ్చారు. 24 సంవత్సరాల క్రితం మోడీ జమైకాలోని మాంటెగో బే(Montego Bay)లో పర్యటించినప్పుడు అక్కడి ప్రవాస భారతీయుల(Expatriate Indians)తో సమావేశమాయారు. మోడీ వారితో మాట్లాడుతున్న సందర్భంగా తీసిన ఫోటోను ఆండ్రూ గిఫ్ట్(Gift)గా ఇచ్చారు.ఈ ఫోటోను చూస్తూ మోడీ సంతోషం వ్యక్తం చేశారు.అలాగే ఆండ్రూకు టీమిండియా క్రికెటర్లు సంతకాలు చేసిన క్రికెట్ బ్యాట్(Cricket bat)ను మోడీ బహుకరించారు.ఆండ్రూ కూడా వెస్టిండీస్(West Indies) దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్(Chris Gayle) సంతకం చేసిన బ్యాట్ అందజేశారు.కాగా జమైకా ప్రధాని భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

Advertisement

Next Story