సంధి ఒప్పందాల కమిషన్‌లో మోడీ.!

by Disha Web Desk 16 |
సంధి ఒప్పందాల కమిషన్‌లో మోడీ.!
X

జెనీవా: మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఐరాస ముందు కీలక ప్రతిపాదన తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఐదు సంవత్సరాల పాటు ప్రపంచ సంధిని ప్రోత్సహించడానికి ముగ్గురు ప్రపంచ అధినేతలతో కూడిన కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. దీని భారత ప్రధాని నరేంద్ర మోడీ, పోప్ ఫ్రాన్సిస్, ఐరాస సెక్రటరీ జనరల్‌లు ఉండాలని సూచించారు. ఈ విషయాన్ని ఎంఎస్ఎన్ వెబ్ పోర్టల్ నివేదించింది. 'నేను ఐరాస ముందు ఓ ప్రతిపాదన తీసుకొస్తున్నాను. దీనికి మీడియా సహకారం కూడా అందించాలి. ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్ ఏర్పాటు చేయాలి.

ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆపడానికి ఒక ప్రతిపాదనను సమర్పించడం, కనీసం ఐదేళ్లపాటు సంధిని కోరుకునేలా ఒప్పందం కుదుర్చుకోవడం కమిషన్ లక్ష్యం' అని ఒబ్రాడోర్ అన్నారు. ఈ ముగ్గురు ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాన్ని ఆపే ప్రతిపాదన తీసుకురావడమే కాకుండా, కనీసం ఐదేళ్ల పాటు సంధి కుదిర్చేలా ఒప్పందం చేస్తారని తెలిపారు. యుద్ధప్రాతిపదికన చర్యలకు స్వస్తి పలకాలని పిలుపునిస్తూ, మెక్సికన్ అధ్యక్షుడు చైనా, రష్యా, యునైటెడ్ స్టేట్స్‌లను శాంతిని కోరేందుకు ఆహ్వానించారు. దీంతో తైవాన్, ఇజ్రాయిల్, పాలస్తీనా విషయాల్లో ఘర్షణను ప్రోత్సహించకుండా సహయపడే అవకాశం ఉంది.


Next Story

Most Viewed