అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం..

by Dishanational4 |
అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం..
X

వాషింగ్టన్ డీసీ: న్యూయార్క్ నగరంలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసమైంది. ఇలాంటి ఘటనలు అమెరికాలో వరుసగా చోటు చేసుకుంటున్నాయి. అమెరికా పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 16న శ్రీ తులసి మందిర్ వద్ద ఉన్న విగ్రహాన్ని ఆరుగురు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. అలాగే రహదారిపై, విగ్రహం దగ్గర ద్వేషపూరిత పదాలను రాశారు. 25-30 ఏళ్ల వయసున్న వారు దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక సీసీ ఫుటేజీని కూడా సేకరించారు. ఈ ఫుటేజీలో మెర్సిడెస్ బెంజ్, బ్లాక్ కలర్ కారులో దుండగులు వచ్చినట్లు కనిపిస్తోంది. విగ్రహాన్ని ధ్వంసం చేసి అక్కడి నుంచి పారిపోయిన విజువల్స్ ఉన్నాయి.

కాగా, ఆగస్టు 3వ తేదీన కూడా మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. రెండు వారాల వ్యవధిలోనే రెండు విగ్రహాలు ధ్వంసమైనట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ఘటనపై న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్‌కుమార్ ఖండించారు. నేరస్తులను వెంటనే పట్టుకుని అరెస్ట్ చేయాలన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు ఆదేశించారు. కాగా, ఈ ఏడాది జులై 14న కెనడాలోనూ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో అక్కడ సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. అలాగే ఫిబ్రవరిలో ఎన్‌వైసీలోని మాన్‌హట్టన్‌లో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.


Next Story

Most Viewed