ట్విట్టర్ నూతన సీఈఓగా లిండా బాధ్యతలు

by Satheesh |
ట్విట్టర్ నూతన సీఈఓగా లిండా బాధ్యతలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ కొత్త సీఈఓగా లిండా యాకరినో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్ బీసీ యూనివర్సల్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసిన లిండాను ట్విట్టర్‌కు నూతన సీఈఓగా నియమించబోతున్నట్లు ట్విట్టర్ అధినేత గత నెలలో ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా లిండా స్పందిస్తూ.. ఇకపై ట్విట్టర్‌పై దృష్టి సారిస్తానని తెలిపారు.

తన అనుభవం మొత్తాన్ని ట్విట్టర్‌పై కేంద్రీకరించి ట్విట్టర్ 2.0 నిర్మించేందుకు టీం అందరితో కలిసి సమిష్టిగా పని చేస్తామని చెప్పారు. ఎలాన్ మస్క్‌తో పాటు ట్విట్టర్ యూజర్లతో కలిసి అనేక మార్పులు చేపట్టబోతున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే 2.0 నిర్మాణంపై ట్విట్టర్ దృష్టి సారించినట్లు చర్చ జరుగుతున్న వేళ భవిష్యత్ లో ట్విట్టర్ లో ఎలాంటి మార్పులు జరుగుతాయనేది ఆసక్తిగా మారింది.

Next Story