తైవాన్‌ పోల్స్‌లో గెలిచిన ‘చైనా ట్రబుల్ మేకర్’

by Hajipasha |
తైవాన్‌ పోల్స్‌లో గెలిచిన ‘చైనా ట్రబుల్ మేకర్’
X

దిశ, నేషనల్ బ్యూరో : చైనాకు తైవాన్ ప్రజలు షాకిచ్చారు. తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఏదైతే జరగకూడదని చైనా భావించిందో అదే జరిగింది. చైనా వ్యతిరేక వైఖరి కలిగిన డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) నేత లై చింగ్ తే ఘన విజయం సాధించారు. దీంతో మరోసారి తైవాన్ అధికార పీఠాన్ని డీపీపీ కైవసం చేసుకుంది. ఇప్పటివరకు లై చింగ్ తే తైవాన్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. అధ్యక్ష ఎన్నికలలో తైవాన్ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కుమింటాంగ్ (కేఎంటీ) అభ్యర్థి హౌ యు ఇహ్, తైవాన్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి కో వెన్-జే కూడా పోటీపడ్డారు. అయితే చివరకు విజయం మాత్రం లై చింగ్ తేను వరించింది. లై చింగ్‌ను ప్రమాదకరమైన వేర్పాటువాదిగా చైనా అభివర్ణించింది. తైవాన్‌లో రక్షణను పెంచడానికి తాను కట్టుబడి ఉన్నానని లై ప్రకటించారు. ఇక ఇదే సమయంలో చైనాతో సంబంధాల బలోపేతానికి కూడా ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed