కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి విషమం..!

by Dishanational4 |
కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి విషమం..!
X

ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన సోదరి కిమ్ యో జోంగ్ గురువారం తెలిపారు. అయితే కిమ్‌కు కరోనా వైరస్ సోకిందా? అనే విషయంపై ఆమె స్పష్టతను ఇవ్వలేదు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'తీవ్ర జ్వరం కారణంగా కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దేశ ప్రస్తుత పరిస్థితులు, ప్రజలను దృష్టిలో పెట్టుకుని తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయలేదు. విశ్రాంతి తీసుకోకుండా ప్రజా సేవలో పాల్గొన్నారు.' అని కిమ్ యో జోంగ్ తెలిపారు. అలాగే దక్షిణ కొరియాపై కిమ్ యో తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. బెలూన్ల ద్వారా ఉత్తర కొరియాలో వైరస్ వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని కిమ్ యో హెచ్చరించారు. అధిక బరువుతో బాధపడుతున్న కిమ్.. ఇటీవల గుండె సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు సమాచారం.


Next Story

Most Viewed