Kim Jong Un:మరో కఠిన నిర్ణయం తీసుకున్న నియంత కిమ్..అలాంటి హెయిర్‌స్టైల్‌తో పట్టుబడితే 6 నెలల జైలు శిక్ష..!

by Maddikunta Saikiran |
Kim Jong Un:మరో కఠిన నిర్ణయం తీసుకున్న నియంత కిమ్..అలాంటి హెయిర్‌స్టైల్‌తో పట్టుబడితే 6 నెలల జైలు శిక్ష..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర కొరియా(North Korea) అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌(Kim Jong Un) నియంత పాలన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అతనికి సంబంధించి ప్రతీసారి ఏదో ఒక సంచలన విషయం బయటపడుతూనే ఉంటుంది.కఠినమైన నిబంధనలతో పాటు చిన్న చిన్న తప్పులకి ఘోరమైన శిక్షలు ఆయన విధిస్తూ ఉంటారు. ఇక అక్కడ ప్రజలు ఎక్కువగా నవ్వకూడదు. ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోకూడదు. ఇష్టం వచ్చిన చదువు చదవకూడదు. ఇష్టం వచ్చిన చోటికి వెళ్లకూడదు. ఇలాంటివన్నీ కూడా కిమ్ జాంగ్ ఉన్ చెప్పినట్లుగానే జరగాలి. తినే తిండి దగ్గర నుంచి ఇక ఉండే ఇల్లు వరకు ప్రతి ఒక్కటి ఆయన చెప్పినట్లుగానే ప్రజలు నడుచుకోవాలి. ఎవరైనా ధైర్యం చేసి ఎదురు తిరిగితే వారిని దారుణంగా చంపేస్తూ ఉంటాడు ఈ నియంత.

ఇదిలాఉంటే తాజాగా కిమ్‌ తీసుకున్న మరో కఠినమైన నిర్ణయం ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.ఉత్తరకొరియా దేశంలో ఎవరు కూడా పోనీ టైల్స్(ponytails) హెయిర్‌స్టైల్‌ని వేసుకోకూడదని ఆర్డర్స్ పాస్ చేశాడు.ఎవరైనా అలాంటి హెయిర్‌స్టైల్‌తో పట్టుబడితే వారికి 6 నెలల పాటు కఠినమైన జైలు శిక్ష తప్పదంటూ కొత్త రూల్ తీసుకొచ్చారు. శత్రువులపై యుద్ధంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిమ్ వెల్లడించారు. ఇదేగాక మూడు నెలల క్రితం మహిళలు లిప్‌ స్టిక్‌ వాడొద్దు, శరీరానికి అతుక్కుపోయినట్లుగా ఉండే నీలిరంగు జీన్స్ ధరించొద్దంటూ అక్కడి ప్రజలకి కిమ్ రూల్స్ పెట్టాడు. ఇలాంటివి దక్షిణ కొరియా దేశం యొక్క స్టైల్ అని అలాంటివి ఉత్తర కొరియాలో కనిపించకూడదు అంటూ సరికొత్త నిబంధన పెట్టారు. ప్రతి ఒక్కరు ఇది పాటించాల్సిందే అంటూ కిమ్ ఆదేశించాడు. దీంతో కిమ్ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. .

Advertisement

Next Story

Most Viewed