సెంట్రల్ గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

by Dishanational4 |
సెంట్రల్ గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఓ వైపు ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు ఇరాన్ రెడీ అవుతుంటే.. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనాలోని గాజాపై దాడులను కంటిన్యూ చేస్తోంది. శుక్రవారం ఉదయం సెంట్రల్ గాజాలోని నుసీరత్ పట్టణం లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ప్రాంతంపైకి ఫిరంగులతో తూటాల వర్షాన్ని కురిపించడంతో పాటు మిస్సైళ్లను సంధించింది. గురువారం అర్ధరాత్రి నుంచే ఇజ్రాయెల్‌కు చెందిన ఫిరంగుల ధ్వనులు, యుద్ధ విమానాలు జారవిడిచిన బాంబుల పేలుడు సౌండ్స్‌ను విన్నామని సెంట్రల్ గాజావాసులు చెప్పారు. ‘‘ఖాన్ యూనిస్‌ పట్టణాన్ని ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది. ఇప్పుడు నుసీరత్‌ను కూడా అలాగే చేస్తారనిపిస్తోంది’’ అని నుసీరత్ పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ దాడుల భయంతో ఇప్పటికే గాజాలోని చాలామంది ఈజిప్టు బార్డర్‌లోని గాజా పట్టణం రఫాకు వలస వెళ్లారు. అక్కడ దాదాపు 15 లక్షల మందికిపైగా పాలస్తీనా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారని తెలుస్తోంది. తదుపరిగా అక్కడ కూడా వైమానిక దాడులు చేస్తామని ఇజ్రాయెల్ అంటోంది. అదే జరిగితే మరింతగా ప్రాణ నష్టం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.



Next Story

Most Viewed