Israel-Hezbollah: ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోండి..లెబనాన్​ పౌరులకు ఇజ్రాయెల్ హెచ్చరిక

by Maddikunta Saikiran |
Israel-Hezbollah: ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోండి..లెబనాన్​ పౌరులకు ఇజ్రాయెల్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్:ఇజ్రాయెల్(Israel),హెజ్​బొల్లా(Hezbollah)మధ్య గత కొన్ని రోజులుగా భీకరమైన యుద్ధం(Fierce war) జరుగుతున్న విషయం తెలిసిందే.హెజ్​బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా (Hassan Nasrallah)మరణం తర్వాత లెబనాన్​పై ఇజ్రాయెల్ దాడులు మరింత ఉధృతం చేసింది.హెజ్​బొల్లా సభ్యులు, ఆయుధాలను అంతం చేయడమే లక్ష్యంగా దాడులను తీవ్రతరం చేసింది.ఈ నేపథ్యంలోనే లెబనాన్ లోని హెజ్​బొల్లా స్థావరాలపై వరుస బాంబు దాడులతో విరుచుకపడుతోంది.ఈ తరుణంలో బోర్డర్ ఏరియాలో నివసిస్తున్న లెబనాన్​ దేశ ప్రజలు తమ నివాసాలను వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది.ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) ఎక్స్(X) లో ప్రకటించింది.

ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతం నుంచి అరవై కిలో మీటర్ల దూరంలో నివాసముంటున్న లెబనాన్ ప్రజలంతా ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాలని పేర్కొంది.ఈ రెండు దేశాల మధ్య దాడుల కారణంగా దాదాపు 10 లక్షల మంది లెబనాన్ పౌరులు తమ నివాసాలను ఖాళీ చేసి వెళ్లిపోయారని,ఆ దేశ చరిత్రలోనే ఇంత మంది తరలి వెళ్లడం ఇదే మొదటిసారని లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటి (Najib Mikati) తెలిపారు. కాగా ఆదివారం సెంట్రల్ బీరుట్ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో 105 మంది మరణించారని లెబనాన్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Next Story