- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
స్పేస్ఎక్స్ నుంచి చంద్రుడి యాత్రకు వెళ్లనున్న భారత నటుడు

టోక్యో: భారత నటుడు దేవ్ జోషి అరుదైన అవకాశాన్ని కొట్టేశాడు. చంద్రుడి యాత్ర చేపట్టనున్న జపానీస్ బిలియనీర్ యుసాకు మేజావా బృందంలో చోటు దక్కించుకున్నాడు. విషయాన్ని యుసాకు శుక్రవారం ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. వచ్చే ఏడాదిలో డియర్ మూన్ పేరుతో జరిగే యాత్రలో ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ఎక్స్ రాకెట్‌లో ప్రయాణించే వారి పేర్లను వెల్లడించాడు.
వీరిలో యూఎస్‌కు చెందిన డీజే, ప్రొడ్యూసర్ స్టీవ్ అవోకి, అమెరికన్ యూట్యూబర్ టిమ్ డాబ్, చెక్ అర్టిస్ట్ ఎమి ఏడీ, ఐరీష్ ఫోటోగ్రాఫర్ రియానన్ ఆడామ్, అమెరికన్ ఫిల్మ్ మేకర్ బ్రెండన్ హాల్, భారతీయ నటుడు దేవ్ జోషి, దక్షిణ కొరియా టాప్ మ్యూజిషియన్ కేపాప్ ఉన్నారు.
2018 నుండి పనిలో ఉన్న తొలి చంద్రుడి యాత్రలో ప్రతి సీటును మేజావా కొనుగోలు చేశాడు. గత ఏడాది 12 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఆయన పర్యటించారు. స్పెస్‌ఎక్స్ ద్వారా ప్రయాణించనున్న తొలి వాణిజ్య పర్యటన ఇదే కానుండడం గమనార్హం. కాగా, దేవ్ జోషి పలు టీవీ షోలు, చిత్రాల్లో మెప్పించాడు.