ఆఫ్ఘన్ ప్రజలకు అండగా ఉంటాం : Ruchira Kamboj

by Disha Web Desk 13 |
ఆఫ్ఘన్ ప్రజలకు అండగా ఉంటాం : Ruchira Kamboj
X

న్యూయార్క్ : ఆఫ్ఘనిస్తాన్‌కు శాంతి, స్థిరత్వం, మానవతా మద్దతు కల్పించడం కోసం భారత్ ప్రదర్శిస్తున్న స్థిరమైన అంకితభావాన్ని గురించి ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ పునరుద్ఘాటించారు. బుధవారం ఆఫ్ఘనిస్తాన్‌పై U.N. భద్రతా మండలి బ్రీఫింగ్‌లో ఆమె మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో భారత్‌కు గల చారిత్రక, నాగరికత సంబంధాలపై దృష్టి సారిస్తూ.. ఆ దేశంలో పరిస్థితికి సంబంధించి మూడు కీలక పరిశీలనలను కాంబోజ్ హైలైట్ చేశారు. ‘పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు స్నేహితుడిగా.. ఆ దేశంలో శాంతి, స్థిరత్వం తిరిగి రావడానికి భారతదేశం ప్రత్యక్ష పాత్రను పోషిస్తుంది’ అని కాంబోజ్ తన ప్రసంగం ప్రారంభంలో చెప్పారు.

తమ సాధారణ, తక్షణ ప్రాధాన్యతల్లో ఆఫ్ఘన్ ప్రజలకు మానవతా సహాయం అందించడం.. సమగ్రమైన, ప్రాతినిధ్య ప్రభుత్వ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం.. ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడం.. మహిళలు, పిల్లలు, మైనారిటీల హక్కులను పరిరక్షించడం వంటివి ఉన్నట్లు కాంబోజ్ వెల్లడించారు. కాగా.. కాబూల్ పతనం, తాలిబాన్ స్వాధీనం తర్వాత ఆగస్టు 30, 2021న ఆమోదించిన భద్రతా మండలి తీర్మానం 2593లో ఆఫ్ఘన్ పట్ల భారతదేశ సామూహిక విధానం గురించి స్పష్టంగా చెప్పబడింది.

Next Story

Most Viewed