ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాల ధ్వంసం.. గోడలపై భారత్ వ్యతిరేక రాతలు

by Disha Web Desk 17 |
ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాల ధ్వంసం.. గోడలపై భారత్ వ్యతిరేక రాతలు
X

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో మూడు హిందూ దేవాలయాలు ధ్వంసానికి గురవడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. వాటి గోడలపై భారత్ వ్యతిరేక రాతలున్నాయి. దీంతో ఇందులో ఉగ్రవాదుల హస్తమున్నట్టు అనుమానం కలుగుతోంది. జనవరి ఆరంభంలో మెల్‌బోర్న్‌లోని స్వామినారాయణ టెంపుల్, విక్టోరియాలోని కార్రమ్ డౌన్స్‌లో శ్రీ శివ విష్ణు టెంపుల్, మెల్‌బోర్న్‌లోని ఇస్కాన్ టెంపుల్ సమాజ వ్యతిరేక శక్తుల ఆగ్రహానికి బలయ్యాయి.

'మళ్లీ మళ్లీ ఇష్టం వచ్చినట్టు జరుగుతున్న ఈ విధ్వంసాలు మనలను హెచ్చరిస్తున్నాయి. దేవాలయాల గోడలపై ఉన్న రాతలను చూస్తే భారత వ్యతిరేక శక్తులే దీన్ని చేసి ఉంటాయన్న అనుమానం కలుగుతోంది' అని కాన్‌బెర్రాలోని ఇండియన్ హై కమిషన్ ఘాటైన వ్యాఖ్యలు చేసింది.


ఇటువంటి పనులను చూస్తుంటే శాంతియుతంగా, నమ్మకంతో, ఒకరి సంస్కృతి సంప్రదాయాలను మరొకరు గౌరవిస్తూ ముందుకు సాగుతున్న ఇండియా, ఆస్ట్రేలియా సంబంధాలను చెడగొట్టాలన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని కమిషన్ పేర్కొంది. 'ప్రొ-ఖలిస్తాన్ తమ కార్యకలాపాలను ఆస్ట్రేలియాల్ ప్రారంభించింది.

ఇతర దేశాల నుంచి వచ్చిన సిఖ్స్ ఫర్ జస్టీస్ (ఎస్ఎఫ్‌జె)తో పాటు ఇతర ఉగ్రవాద సంస్థల సభ్యులు ఇటువంటి చర్యలకు సహాయపడుతున్నాయి. 'ఇలాంటి పనులకు పాల్పడే వారిని న్యాయస్థానంలో నిలబెట్టడమే కాకుండా... ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు కూడా తీసుకుంటాం' అని భారత హై కమిషన్ పేర్కొంది.



Next Story

Most Viewed