ఖలీస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌కు భారత్ బిగ్ షాక్

by Disha Web Desk 2 |
ఖలీస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌కు భారత్ బిగ్ షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కెనడాలో ఉన్న హిందువులంతా ఇండియాకు వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు చేసిన ఖలీస్థాన్ వేర్పాటువాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నున్‌కు భారత్ గట్టి షాకిచ్చింది. అమృత్ సర్ జిల్లా ఖాన్ కోట్‌లో అతని పేరిట ఉన్న వారసత్వ వ్యవసాయ భూమి, ఛండీగఢ్‌లో ఉన్న ఇంటిని ఎన్ఐఏ శనివారం సీజ్ చేసింది. ఇకపై ఈ ఆస్తులు ప్రభుత్వానికి చెందినవిగా ప్రకటించింది. కెనడా - భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య కెనడాలోని హిందువులంతా ఇండియాకు వెళ్లిపోవాలంటూ గురపత్వంత్ ఇటీవల హెచ్చరికలు జారీ చేస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు.

ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించింది. మరోవైపు అతనిపై గతంలో నమోదైన కేసుల్లో తాజాగా చర్యలు తీసుకుంది. నిజానికి 2020లోనే అతని పేరుతో ఉన్న ఆస్తులను భారత ప్రభుత్వం అటచా చేసింది. అప్పటి నుంచి వాటికోసం కెనడా లీగల్ సెల్ గ్రూపుల ద్వారా గురపత్వంత్ ప్రయత్నాలు కొనసాగిస్తుండగా తాజాగా ఎన్ఐఏ వాటిని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుంది.

Next Story

Most Viewed