భారత్-బౌండ్ కార్గోను షిన్‌ను హైజాక్ చేసిన హౌతీ తిరుగుబాటుదారులు

by Disha Web Desk 12 |
భారత్-బౌండ్ కార్గోను షిన్‌ను హైజాక్ చేసిన హౌతీ తిరుగుబాటుదారులు
X

దిశ, వెబ్‌డెస్క్: యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు భారత్‌కు వెళ్తున్న దక్షిణ ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ కార్గో షిప్‌ను హైజాక్ చేశారు. దీనిని.. ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈ చర్యరను 'ఇరానియన్ తీవ్రవాద చర్య, ప్రపంచ స్థాయిలో చాలా ఘోరమైన సంఘటన' అని పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఈ వార్తను ధృవీకరించింది. బ్రిటీష్ యాజమాన్యంలోని, జపాన్ నిర్వహించే కార్గో షిప్‌ను టెహ్రాన్ మిత్రులైన హౌతీలు స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది.

కార్గో షిప్‌లో ఇజ్రాయెల్ వారెవ్వరూ లేరని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు, హౌతీస్ మిలీషియా కూడా హైజాక్‌ను ధృవీకరించింది. అయితే, ఇజ్రాయెల్ ప్రభుత్వం తక్షణమే తిరస్కరించిన ఇజ్రాయెల్ నౌకను తాము స్వాధీనం చేసుకున్నామని ఆ సంస్థ పేర్కొంది. హౌతీల ప్రకారం, దక్షిణ ఎర్ర సముద్రం నుండి ఓడను యెమెన్ నౌకాశ్రయానికి తీసుకు వెళ్లినట్లు బృందం తెలిపింది.

Next Story