హింసకు ముగింపు పలకాలి.. హిందు, ముస్లింల ఉమ్మడి ప్రకటన

by Disha Web Desk 17 |
హింసకు ముగింపు పలకాలి.. హిందు, ముస్లింల ఉమ్మడి ప్రకటన
X

లండన్: లిసెస్టర్‌లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలపై హిందు, ముస్లిం కమ్యూనిటీ లీడర్లు ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. గత నెలలో భారత్, పాక్ మధ్య జరిగిన ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌పై మొదటి వాగ్వాదాల తర్వాత గత వారంలో తీవ్రస్థాయి హింసకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేసింది.

విభజనకు కారణమయ్యే ఎలాంటి విదేశీ విధ్వంస ఆలోచనకు స్థానం లేదని అన్నారు.

'అర్ధ శతాబ్దానికి పైగా ఈ నగరంలో ఇరు వర్గాల విశ్వాసాలతో సామరస్యంగా జీవిస్తున్నాం. మనం కలిసి ఈ నగరానికి వచ్చాము. అందరం ఒకే రకమైన సవాళ్లను ఎదుర్కొన్నాము. జాత్యహంకారాన్ని ప్రదర్శించే వ్యక్తులతో పోరాడాం. సమిష్టిగా ఈ నగరాన్ని భిన్నత్వం, సమాజ ఐక్యత మార్గదర్శిగా మార్చాము. అయితే ఆందోళనలు, హింస ప్రశాంతమైన సమాజంలో భాగం కాలేవు' అని ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా, ఈ హింసలో భాగమైన 15 మందిని పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేశారు. ఆసియాకప్‌లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి.


Next Story

Most Viewed