నా భార్యకు ఏమైనా జరిగితే వదిలిపెట్టను..పాక్ ఆర్మీ చీఫ్‌కు ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్

by Dishanational2 |
నా భార్యకు ఏమైనా జరిగితే వదిలిపెట్టను..పాక్ ఆర్మీ చీఫ్‌కు ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ పై ఆ దేశ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య బుష్రా బీబీ జైలుకెళ్లడానికి మునీరే కారణమని ఆరోపించారు. ‘నా భార్యకు శిక్ష విధించాలని మునీర్ న్యాయమూర్తిపై ఒత్తిడి తీసుకొచ్చారు. అందుకే ఆమెను దోషిగా నిర్ధారించారు. బుష్రాకు ఏమైనా జరిగితే మునీర్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టను’ అని వార్నింగ్ ఇచ్చారు. ఆయన చేసే రాజ్యాంగ విరుద్ధమైన పనులన్నింటికీ బయడపెడతానని తెలిపారు. దేశంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని విమర్శించిన ఇమ్రాన్..రాజు ఆదేశిస్తే నవాజ్ షరీఫ్ కేసులన్నీ మాఫీ చేస్తారని తెలిపారు. తమకు ఐదు రోజుల్లోనే మూడు కేసుల్లో శిక్ష విధించారని చెప్పారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ రుణాల ద్వారా కాకుండా పెట్టుబడి ద్వారా ఆర్థిక వ్యవస్థ స్థిరపడుతుందని అన్నారు. దేశంలో ఆటవిక రాజ్యం ఉన్నన్ని రోజులు పెట్టుబడులు రావడం సాధ్యం కాదని తెలిపారు. దేశంలో చట్టబద్ధత ఏర్పడిన తర్వాతే ఇన్వెస్ట్ మెంట్స్ తరలివస్తాయని తెలిపారు. ఉపఎన్నికల్లో పీటీఐ అభ్యర్థులను పోటీచేయకుండా అడ్డుకునే ప్రయత్నిం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఇమ్రాన్ ఆరోపణలపై పాక్ సైన్యం స్పందించలేదు. కాగా, తోషాఖానా కేసులో ఇమ్రాన్ సహా ఆయన భార్యకు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

Next Story