- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Russia : రష్యాలోకి 30 కి.మీ చొచ్చుకెళ్లిన ఉక్రెయిన్ ఆర్మీ
దిశ, నేషనల్ బ్యూరో : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొత్త మలుపు తిరిగింది. ఉక్రెయిన్ సైన్యం ఇప్పుడు రష్యా భూభాగంలోకి చొరబడింది. దాదాపు 1000 మందికిపైగా ప్రత్యేక బలగాలతో కూడిన ఉక్రెయిన్ సైనిక యూనిట్ రష్యా సరిహద్దులు దాటి 30 కిలోమీటర్ల మేర లోపలికి చొచ్చుకు వెళ్లింది. ఈశాన్య ఉక్రెయిన్‌లోని సుమీ ఒబ్లాస్ట్ ప్రాంతం నుంచి బయలుదేరిన ఈ సైనిక యూనిట్ రష్యాలోని కుర్స్క్ ఒబ్లాస్ట్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ ప్రాంతం పరిధిలోని స్వెర్ ద్లికోవో, సుద్జా, మలయా, ల్యుంబీ మోవ్కా నగరాలలో ఉక్రెయిన్ ఆర్మీ పాగా వేసింది. ఈ విషయాన్ని రష్యా ఆర్మీ కూడా ధ్రువీకరించింది. ఉక్రెయిన్ ఆర్మీ చర్యలపై స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఘాటుగా స్పందించారు. దీనికి తగిన సమాధానం ఇస్తామని ప్రకటించారు. ఈనేపథ్యంలో పెద్దఎత్తున యుద్ధ ట్యాంకులు, రాకెట్ లాంచర్లు, సైనిక ట్రక్కులతో ఆయా నగరాలను రష్యా ఆర్మీ చుట్టుముట్టింది. అక్కడి నుంచి ఉక్రెయిన్ సైన్యాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నాల్లో నిమగ్నమైంది.
జెలెన్‌స్కీ ప్రతిజ్ఞ తర్వాత..
ఉక్రెయిన్ నగరాలపై రష్యా యుద్ధ విమానాలు ఇటీవలే భీకర దాడులు చేశాయి. జనావాసాలపైనా బాంబులను జార విడిచారు. ఆ దాడుల్లో ఎంతోమంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.ఈనేపథ్యంలో రష్యాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రతిజ్ఞ చేశారు. ఈక్రమంలోనే రష్యాలోకి ఉక్రెయిన్ ఆర్మీ ప్రవేశించిందని పరిశీలకులు అంటున్నారు. రష్యాను ఒత్తిడిలోకి నెట్టే వ్యూహంలో భాగంగానే ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ ఆర్మీ వినియోగిస్తున్న ఆయుధాలన్నీ దాదాపుగా ఐరోపా, అమెరికా, నాటో దేశాల నుంచి వచ్చినవే కావడం గమనార్హం.