You Tube మాజీ సీఈవో సుసాన్‌ మృతి

by Maddikunta Saikiran |
You Tube మాజీ సీఈవో సుసాన్‌ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : యూట్యూబ్ మాజీ CEO సుసాన్ వోజ్‌కికీ మృతి చెందారు. 56 ఏళ్ల సుసాన్ గత 2 సంవత్సరాల నుండి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు . ఆమె మరణ వార్తను భర్త డెన్నిస్ ట్రోపర్ నిన్న ప్రకటించారు. డెన్నిస్ ట్రోపర్ తన పేస్ బుక్ పేజీలో మాట్లాడూతూ.. 'సుసాన్ గత రెండు సంవత్సరాలుగా నాన్ స్మాల్ సెల్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతూ శుక్రవారం కన్ను మూశారని తెలిపారు .అయితే మొదటి గూగుల్ ఉద్యోగులలో సుసాన్ ఒకరు కావడం విశేషం. ఆమె 2014లో YouTube CEO అయ్యారు. సుసాన్ వోజ్‌కికీ Google కంటే ముందు Intel ,Bain కంపెనీలో పనిచేశారు.

కాగా.. సుసాన్ మృతిపై గూగుల్ CEO సుందర్ పిచాయ్ శనివారం Xలో తన సంతాపం వ్యక్తం చేశారు. "నా ప్రియమైన స్నేహితురాలు సుసాన్ వోజ్‌కికీని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందని, గూగుల్‌ చరిత్రలో వోజ్‌కికీ అతి ప్రధానమైన వ్యక్తని, ఆమె లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టంగా ఉందని" తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed