మనీలాండరింగ్ కేసులో మాజీ ప్రధాని అరెస్ట్

by Mahesh |
మనీలాండరింగ్ కేసులో మాజీ ప్రధాని అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: మనీలాండరింగ్ (money laundering) కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న మారిషస్‌ మాజీ ప్రధాని (Former Prime Minister of Mauritius) ప్రవింద్ జగన్నాథ్‌ (Pravind Jagannath)ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఆయనతో సంబంధం ఉన్న అనుమానితుల ఇళ్లపై దాడుల్లో నగదు స్టాక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు శనివారం అతని భార్య కోబితా జగన్నాథ్‌ (Kobitha Jagannath)తో పాటు 63 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించిన తర్వాత ఆదివారం మాజీ ప్రధాని నివాసంలో సోధాలు నిర్వహించి జగ్‌నాథ్‌ల పేర్లతో కూడిన పత్రాలు, అలాగే లగ్జరీ వాచీలు, వివిధ కరెన్సీల స్టాక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రవింద్ జుగ్‌నాథ్ న్యాయవాది రవూఫ్ గుల్బుల్ మాత్రం ఆయనపై వచ్చిన ఆరోపణలు కొట్టిపారేశారు. మాజీ ప్రధాని ని న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తామని ఆయన చెప్పారు.

స్థానిక రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్ ఇంట్లో కూడా పోలీసులు సోదాలు చేసి నగదు సూట్‌కేస్‌లను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. మారిషస్‌ ద్వీపం (Mauritius island)లోని ఆర్థిక నేరాల కమిషన్, "మనీలాండరింగ్ కేసు"పై దర్యాప్తును ఉటంకిస్తూ.. శనివారం జారీ చేసిన నోటీసులో, ప్రవింద్ జగన్నాథ్‌.. మరో ఇద్దరు అనుమానితులను దేశం విడిచి వెళ్ళడానికి ప్రయత్నిస్తే వారిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులను కోరింది. ఈ క్రమంలో ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేశారు. ప్రవింద్ జగన్నాథ్‌ 2017 నుంచి 2024 వరకు మారిషస్‌ ప్రధానికగా కొనసాగాడు. ఈ సమయంలో ఆయన చేసిన కొన్ని ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని వాటిపై విచారణ చేస్తామని కొత్త ప్రధాని నవీన్ రామ్ (Prime Minister Naveen Ram) ప్రకటించారు. ఈ మేరకు ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed