యూఎస్ గ్రీన్ కార్డుకు అప్లై చేసుకున్న మాజీ రాష్ట్రపతి..?

by Disha Web Desk 14 |
యూఎస్ గ్రీన్ కార్డుకు అప్లై చేసుకున్న మాజీ రాష్ట్రపతి..?
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక మాజీ రాష్ట్రపతి రాజపక్స తిరిగి శ్రీలంక రానున్నారని, వచ్చే వారంలో దేశానికి వస్తారని శ్రీలంక అధికార పార్టీ నేతలు తెలిపారు. అయితే ఈ క్రమంలో తాజాగా రాజపక్స గురించి వస్తున్న వార్తలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతుంది. శ్రీలంక మాజీ రాష్ట్రపతి రాజపక్స యూఎస్‌లో గ్రీన్ కార్డు కోసం అప్లై చేశారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆయనకు గ్రీన్ కార్డు ఇప్పించేందుకు రాజపక్సకు చెందిన లాయర్లు ప్రయత్నిస్తున్నారని సమాచారం.

అయితే ఆయన సతీమణి లోమా యూఎస్ పౌరురాలు కావడంతో గ్రీన్ కార్డుకు రాజపక్స అర్హులు అయ్యారని నివేదిక పేర్కొంది. అయితే 2019లో శ్రీలంకలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకు రాజపక్స తన యూఎస్ సిటిజెన్ షిప్ వదులుకున్నారు. ఇదిలా ఉంటే రాజపక్స శ్రీలంకకు తిరిగి రానున్నారని ఒకవైపు అధికార పార్టీ మంత్రులు, రాజపక్స మేనల్లుడు తెలిపారు. ఈ సమయంలో గ్రీన్ కార్డుకు అప్లై చేశారని వస్తున్న వార్తలు శ్రీలంకలో సంచలనంగా మారుతున్నాయి.



Next Story