తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్‌.. దారుణంగా పడిపోయిన కరెన్సీ విలువ

by Disha Web Desk 17 |
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్‌.. దారుణంగా పడిపోయిన కరెన్సీ విలువ
X

ఇస్లామాబాద్: పాకిస్తాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. గురువారం డాలర్‌కు 255 రూపాయలకు పడిపోయినట్లు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. కేవలం ఒక్కరోజులోనే 24 రూపాయలు పతనమైనట్లు తెలిపాయి. బుధవారం ఈ విలువ రూ. 230.89‌గా ఉందని వెల్లడించాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నుంచి అవసరమైన రుణాలు పొందడంలో నిరాశే ఎదురు కావడంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం తీవ్రమైనట్లు ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యున్ కథనం పేర్కొంది.

మార్కెట్ ద్వారా మారకపు రేటును నిర్ణయించడానికి యూఎస్ కు చెందిన రుణదాత నిర్దేశించిన కఠినమైన షరతులకు సంకీర్ణ ప్రభుత్వం అంగీకరించడంతో ఇటీవలి పరిణామం వచ్చిందని పలు కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు నిలిచిపోయిన 6.5 బిలియన్ల డాలర్ల నిధులకు ప్రపంచ సంస్థ ఆమోదం పొందాలని పాకిస్తాన్ చూస్తోంది.

కాగా, దేశం ప్రస్తుతం కనివిని ఎరుగని సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. పలు ప్రాంతాల్లో ఇప్పటికే విద్యుత్ సంక్షోభం నెలకొనగా, ఆహార ధాన్యాల ధరలు రెక్కలు తాకుతున్నట్లు సోషల్ మీడియాలో పౌరులు పోస్టులు చేస్తున్నారు. ఆహార ట్రక్కుల వెంట పరుగులు తీస్తున్న వీడియోలను షేర్ చేస్తూ పరిస్థితిని తెలియజేస్తున్నారు. విదేశీ మారక నిల్వల తగ్గిపోవడంతో ఇంధన కొరతకు దారి తీసింది. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద దారి పొడవునా క్యూలైన్లు దర్శనమిచ్చాయని పాక్ ప్రధాన పత్రిక డాన్ తెలిపింది.

అయితే ఖర్చులను నియంత్రించేందుకు మంత్రుల జీతాల్లో కోతలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంతేకాకుండా వారి సంఖ్యను కూడా తగ్గించే ఆలోచనలో పడింది. మరోవైపు విద్యుత్ సంక్షోభం పై ప్రజలకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ క్షమాపణలు కూడా చెప్పారు. సమస్యను గుర్తించి పరిష్కరిస్తామని తెలిపారు.


Next Story

Most Viewed