మరో విషాదం.. విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా దుర్మరణం

by Satheesh |
మరో విషాదం.. విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైయిసీ ఇటీవల విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనను పూర్తిగా మరువకముందే తాజాగా మరో దేశానికి చెందిన అగ్రనేత విమాన ప్రమాదంలో మరణించారు. తాజాగా, మలావీ దేశ ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయనతో పాటు అదే విమానంలో ప్రయాణిస్తోన్న మరో 9 మంది సిబ్బంది సైతం మృతి చెందారు. కాగా, సోమవారం మలావీ రాజధాని లిలోంగ్వే నుండి ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా తొమ్మిది మంది సిబ్బందితో కలిసి సైనిక విమానంలో బయలుదేరారు. అయితే, టేకాఫ్ అయిన కాసేపటికే సౌలస్ షిలిమా ప్రయాణిస్తోన్న విమానం అదృశ్యమైంది. ఏటీసీ రాడార్‌తో విమానానికి కమ్యూనికేషన్ కట్ అయ్యింది.

వైస్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తోన్న విమానం అదృశ్యం కావడంతో వెంటనే భద్రతా దళాలు రంగంలోకి గాలింపు చర్యలు చేపట్టాయి. మంగళవారం సౌలస్ షిలిమా ప్రయాణించిన విమానం పర్వత ప్రాంతాల్లో కూలిపోయిన ఆనవాళ్లను రెస్య్కూ టీమ్స్ గుర్తించాయి. ఈ విమాన ప్రమాదంలో ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమాతో పాటు అందులో ప్రయాణిస్తోన్న 9 మంది సిబ్బంది సహా అందరూ మృతి చెందినట్లు మలావీ దేశ అధికారులు ప్రకటించారు. విమాన ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. కాగా, నెల రోజుల వ్యవధిలోనే రెండు దేశాలకు చెందిన అగ్రనేతలు ఒకే రీతిలో విమాన ప్రమాదంలో మరణించడం ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది.



Next Story

Most Viewed