సముద్రంలో ఆస్ట్రేలియా-చైనా ఘర్షణ.. సోనార్ ప్రయోగించిన డ్రాగన్

by Disha Web Desk 17 |
సముద్రంలో ఆస్ట్రేలియా-చైనా ఘర్షణ.. సోనార్ ప్రయోగించిన డ్రాగన్
X

బీజింగ్: ఆస్ట్రేలియా-చైనా మధ్య స్నేహం చిగురించినట్టే చిగురించి.. మళ్లీ విభేదాలు మొదలయ్యాయి. జపాన్‌ సముద్ర జలాల్లో ఆస్ట్రేలియా నేవీకి చెందిన ఫ్రిగేట్‌లోని ప్రొపెల్లర్‌లో చేపల వల ఇరుక్కుంది. దాన్ని తొలగించేందుకు ఆస్ట్రేలియా డైవర్లు సముద్రంలోకి దూకగా.. చైనాకు చెందిన ఒక డెస్ట్రాయర్‌ నౌక అక్కడికి చేరుకొని వారిపై సోనార్‌ను ప్రయోగించింది. ఈ ఘటనలో ఆస్ట్రేలియాకు చెందిన ఒక డైవర్‌‌కు స్వల్ప గాయాలయ్యాయి.

నవంబర్‌ 14న జరిగిన ఈ ఘటనపై స్పందించిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌.. చైనా చేష్టలను ప్రమాదకరమైనవిగా అభివర్ణించారు. ఈ అంశాన్ని సరైన చోట.. సరైన విధంగా లేవనెత్తుతామని ఆయన స్పష్టం చేశారు. దీనిపై చైనా ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ఇది జరగడానికి వారం ముందే ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ బీజింగ్‌లో పర్యటించారు. అంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

Next Story