సంబంధాల సత్వర పునరుద్ధరణకు చైనా సూచన

by Dishanational4 |
సంబంధాల సత్వర పునరుద్ధరణకు చైనా సూచన
X

బీజింగ్: చైనాతో భారత్ సంబంధాలు అత్యంత కఠిన దిశలో నడుస్తున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై చైనా వెంటనే స్పందించింది. తమ ఇరుదేశాల మధ్య సంబంధాలు తిరిగి గాడిన పడాలంటే భారత్ చొరవ ప్రదర్శించాలని, తాను కూడా ఆ మార్గంలోనే ప్రయాణిస్తామని చైనా ప్రభుత్వం పేర్కొంది. చర్చలకు ప్రారంభ తేదీని భారత్ ప్రకటిస్తే తాను కూడా దానికి అనుగుణంగా స్పందిస్తానని చైనా ప్రభుత్వం పేర్కొంది. అయితే సరిహద్దు సమస్యపై చైనా భిన్నాభిప్రాయాన్ని ప్రకటించింది. అలాగే క్వాడ్ కూటమిపై భారత విదేశీ మంత్రిపై వ్యాఖ్యపై కూడా చైనా విమర్శనాత్మకంగా స్పందించింది.

చైనా, భారత్ కలిసి పనిచేయలేకపోతే ఆసియన్ శతాబ్దం అనే భావన సాకారం కావడం కష్టమేనని బ్యాంకాంక్‌లో క్వాడ్ కూటమి సదస్సు సందర్భంగా భారత విదేశీ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన ప్రకటనను చైనా సానుకూలత తోనే చైనా స్పందించింది. చైనా భారత్ బలమైన వృద్ధి రేటును సాధించకపోతే ఆసియన్ శతాబ్ది అనేది ఉండబోదని చైనా నేత గతంలోనే చెప్పారని చైనా విదేశీ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ గుర్తు చేశారు. చైనా, భారత్ తదితర దేశాలు మంచి వృద్ధి రేటును సాధించినప్పుడే ఆసియా పసిఫిక్ శతాబ్ది లేదా ఆసియన్ శతాబ్ది అనేది సాకారమవుతుంది. మన రెండు దేశాల మధ్య విభేదాల కంటే ఉమ్మడి ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని వాంగ్ పేర్కొన్నారు.

చైనా, భారత్ పరస్పరం నిందించుకోవడం కంటే పరస్పరం బలోపేతం చేసుకునే మార్గంలో నడవాలని వాంగ్ చెప్పారు. భారత్ పక్షం కూడా చైనాతో అదే మార్గంలో పనిచేస్తే మన రెండు దేశాలు పరస్పర సహకారాత్మక భాగస్వాములుగా ఉంటాయని వాంగ్ అభిప్రాయపడ్డారు. సరిహద్దుల్లో చైనా అనుసరించిన వైఖరితోనే ఇరుదేశాల మధ్య పస్తుతం గడ్డు పరిస్థితులు నెలకొన్నాయని జైశంకర్ క్వాడ్ సదస్సు సందర్భంగా పేర్కొన్నారు. దీనిపై వాంగ్ స్పందిస్తూ, భారత్‌తో సరిహద్దు సమస్యలపై చక్కటి కమ్యూనికేషన్‌ను చైనా నడుపుతోందని, ఇరుదేశాల మధ్య చర్చలు మంచి ఫలితాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు.



Next Story

Most Viewed