- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
యూరప్ లో మండుతున్న ఎండలు..44 డిగ్రీలకు పైగా సెల్షియస్ నమోదు
దిశ, వెబ్‌డెస్క్ : వాతావరణ మార్పుల ప్రభావం వల్ల యూరప్‌లో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి . దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా యూరప్‌లో ఎండలు మండిపోతున్నాయి.దాదాపుగా 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .ఎండల తీవ్రత కారణంగా అక్కడి ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. కాగా యూరప్‌లో గత ఏడాది వడగాడ్పుల బారిన పడి 50వేల మంది వరకు చనిపోయారని, అంతకుముందు ఏడాదితో పోల్చితే మరణాల సంఖ్య బాగా పెరిగిపోయిందని 'బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ' వెల్లడించింది.
అయితే .. యూరప్‌లోని దక్షిణ ప్రాంతంలో ఈ ఎండల తీవ్రత మరీ ఎక్కువుంది. ముఖ్యంగా గ్రీస్, బల్గేరియా, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాల్లో వేడిగాలుల తీవ్రత అధికంగా ఉందని దీని కారణంగానే ఆ దేశాల్లో చనిపోయినవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. ప్రపంచంలో అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండంగా యూరప్ ఉందని, దీనివల్ల యూరప్ ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ సంస్థ జరిపిన విచారణలో తేలింది.కాగా గత సంవత్సరం జులైలో గ్రీస్‌లో వడగాల్పులకు కార్చిచ్చు కూడా తోడై రికార్డు స్థాయిలో 44 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రపంచంలో ఇతర ప్రాంతాలకన్నాయూరప్‌లో ఉష్ణోగ్రతలు వేగంగాపెరుగుతున్నాయని ఐరాస పేర్కొంది.