బీబీసీ సమాచార యుద్ధం చేస్తోంది.. డాక్యుమెంటరీపై రష్యా కీలక వ్యాఖ్యలు

by Dishanational4 |
బీబీసీ సమాచార యుద్ధం చేస్తోంది.. డాక్యుమెంటరీపై రష్యా కీలక వ్యాఖ్యలు
X

మాస్కో: వివాదస్పదంగా మారిన బీబీసీ డాక్యుమెంటరీని ఉద్దేశించి రష్యా తీవ్ర విమర్శలు చేసింది. సమాచార యుద్ధం చేస్తుందని రష్యా విదేశాంగ ప్రతినిధి మరియా జఖరోవా ఆరోపించింది. కేవలం రష్యాపై మాత్రమే కాకుండా స్వతంత్ర విధానాన్ని అనుసరిస్తున్న ఇతర ప్రపంచ అధికార కేంద్రాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందనడానికి ఇదే సాక్ష్యమని అన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత, బీబీసీ బ్రిటిష్ స్థాపనలో కూడా పోరాడుతోందని తెలిపారు.

కొన్ని సమూహాల ప్రయోజనాల సాధనంగా ఉందని తేలిందని చెప్పారు. దీనికి తగినట్లుగా వ్యవహరించాలని చెప్పారు. భారత విదేశాంగ శాఖ డాక్యుమెంటరీ నిషేధం విధించిన కొన్ని వారాలకే రష్య మద్దతుగా నిలిచింది. ప్రధాని మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో రెండు భాగాలుగా డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది.



Next Story