యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల్లో మహిళలపై నిషేధం

by Disha Web Desk 12 |
యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల్లో మహిళలపై నిషేధం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్‌ల అరాచకం రోజురోజు పెరిగిపోతుంది. ముఖ్యంగా మహిళలపై తాలిబన్‌ల నిషేద పర్వం కోనసాగుతూనే ఉంది. మొదట మహిళలకు హిజాబ్ తప్పనిసరి చేసిన తాలిబన్లు. తర్వాత మహిళలు ఉద్యోగం చేయడాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత బాలికలకు స్కూల్ లో ప్రవేశాలు లేకుండా చేశారు. తాజాగా యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలకు హాజరైన మహిళా విద్యార్థులపై తాలిబాన్ నిషేధం విధించినట్లు తెలుస్తుంది. తాలిబాన్ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ విశ్వవిద్యాలయాలకు నోటీసులు పంపింది, తదుపరి నోటీసు వచ్చే వరకు మహిళా విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేయరాదని పేర్కొంది.


Next Story

Most Viewed