దేశంలో రెండో అతిపెద్ద టెలికాం సంస్థ డాటా లీక్..

by Dishafeatures2 |
దేశంలో రెండో అతిపెద్ద టెలికాం సంస్థ డాటా లీక్..
X

దిశ, వెబ్‌డెస్క్: కొంత కాలంగా ప్రముఖ సంస్థలు వరుసగా హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. దీని వల్ల యూజర్ డాటా లీక్ అవుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థలు అప్రమత్తం అవుతున్నాయి. ఇటీవల ఉబర్ సర్వర్స్ హ్యాక్ అయింది. ఈ మేరకు విషయాన్ని సంస్థ అంగీకరించింది. కానీ తన వద్ద నుంచి ఎటువంటి యూజర్ డాటా లీక్ అవ్వలేదని పేర్కొంది. అయితే తాజాగా ఆస్ట్రేలియా దేశంలోనే రెండో అతిపెద్ద టెలీ కమ్యూనికేషన్ సంస్థ ఓప్టస్ హ్యకర్స్ దాడికి గురైంది. ఈ విషయంపై సంస్థ స్పందిస్తూ.. గతంలో జరిగిన సైబర్ ఎటాక్ ప్రభావం వ్యక్తిగత వివరాలపై ప్రభావం చూపుతుంటే తమకు వెంటనే తెలియజేయాలని సంస్థ కోరింది.

అంతేకాకుండా 'సైబర్ ఎటాక్‌లో ఎవరెవరి ఐడీ డాక్యుమెంట్ నెంబర్ లీక్ అయిన వినియోగదారులను తాము యూజర్లను సంప్రదించే చర్య ప్రారంభిస్తున్నాం. వివరాలు లీక్ అయిన యూజర్ల నుంచి ఈ చర్య మొదలవుతుంది. ఈ ఎటాక్‌లో ఏ వినియోజదారుడి ఆర్థిక లావాదేవీలు, పాస్‌వర్డ్‌ల వంటిని లీక్ అవ్వలేదు' అని సంస్థ పేర్కొంది. అయితే ఈ సైబర్ ఎటాక్‌తో వినియోగదారులకు ఓప్టస్ సంస్థపై ఉన్న నమ్మకం భారీగా తగ్గే అవకాశం ఉందని, ప్రస్తుతం సంస్థ ఎదురు వినియోగదారుల డాటా రిట్రీవ్ చేయడంతో పాటు, వారి నమ్మకాన్ని తిరిగి సంపాదించాల్సి భారీ టాస్క్‌లు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.


Next Story

Most Viewed