- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పాకిస్థాన్ లో దారుణం.. బెల్జియం మహిళపై 5 రోజుల పాటు గ్యాంగ్ రేప్
దిశ, వెబ్‌డెస్క్ : పాకిస్థాన్ దేశం యొక్క స్వాతంత్ర దినోత్సవం రోజు ఆగస్టు 14న ఘోరం జరిగింది. పాకిస్థాన్ కు టూరిస్ట్ గా వచ్చిన బెల్జియం యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. వివరాల్లోకెళ్తే నిన్నఇస్లామాబాద్ నగర వీధుల్లో 28 ఏళ్ల బెల్జియన్ మహిళ చేతులు కట్టేసిబడి కనిపించింది.రోడ్డు మీద కట్టేసి పడున్న మహిళను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేయగా సంచలన విషయాలు బయటపడ్డాయి. మహిళపై ఐదు రోజుల పాటు గ్యాంగ్ రేప్ జరిగిందని, నేరానికి పాల్పడిన వ్యక్తుల్లో ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ మేరకు సమా టీవీలో వచ్చిన కథనం ప్రకారం.. మహిళను వీపు వెనుకకు కట్టివేసి వీధిలో పడేశారు.కొందరు వ్యక్తులు తనపై ఐదు రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో మహిళ వెల్లడించింది. మహిళ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు తమిజుద్దీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.మహిళా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మిగతా నిందితుల్ని కూడా త్వరలోనే పట్టుకుంటామని, వైద్య పరీక్షల కోసం బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు.