భూమి కంటే లోతైన స‌ముద్రాలున్న గ్ర‌హాన్ని కొనుగొన్న NASA TESS

by Disha Web Desk 20 |
భూమి కంటే లోతైన స‌ముద్రాలున్న గ్ర‌హాన్ని కొనుగొన్న NASA TESS
X

దిశ‌, వెబ్‌డెస్క్ః గ్రహాంతర జీవుల కోసం అన్వేషణ చేయ‌డం శాస్త్రవేత్తలకు చాలా ఇష్టమైన అంశం. అందుకే, కోట్లాను కోట్లు ఖ‌ర్చు చేసి, వాటి కోసం ప‌నిచేస్తుంటారు. ఈ అనంత విశ్వంలో మ‌రో జీవం ఇంకెక్క‌డైనా ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. నిజానికి, మ‌నిషి మ‌నుగ‌డ కోసం నీరు ఎంత ముఖ్య‌మో గ్రహాంతర జీవుల ఉనికికి కూడా నీరు ఒక ముఖ్యమైన సూచనగా శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు. అయితే, ఇటీవ‌ల వారి ఆశ‌ల‌కు ఆధారం దొరికిన‌ట్లు అయ్యింది. మ‌న‌ భూమిపై ఉన్న సముద్రాల కంటే లోతుగా ఉన్న ఒక ఎక్సోప్లానెట్ కనుగొన్నారు.

ఈ గ్రహాన్ని TOI-1452 b గా పిలుస్తున్నారు. ఇది మన గ్రహం నుండి దాదాపు 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ గ్రహం భూమి కంటే 70 శాతం పెద్దది కూడా. దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. ఇక‌, గ్రహం గురించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భూమి ఒకే న‌క్ష‌త్రం చుట్టూ తిరుగుతుంటే, ఇది మాత్రం రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతుంది. ఈ గ్రహం తానున్న‌ నక్షత్ర వ్యవస్థలోని 'గోల్డిలాక్స్ జోన్'లో ఉన్నట్లు పేర్కొన్నారు. యూనివర్శిటీ ఆఫ్ మాంట్రియల్ రీసర్చర్ డాక్టర్ చార్లెస్ కాడియక్స్ నేతృత్వంలోని బృందం ఈ గ్రహాన్ని కనుగొంది. కనుగొన్న విషయాలను ఆస్ట్రోనామికల్ జర్నల్‌లో ప్ర‌చురించారు.

Next Story