చట్టాన్ని ఉల్లంఘించేందుకు అనుమతించబోం: ఇరాన్‌ అధ్యక్షుడు

by Dishanational4 |
చట్టాన్ని ఉల్లంఘించేందుకు అనుమతించబోం: ఇరాన్‌ అధ్యక్షుడు
X

టెఫ్రాన్: ఇరాన్‌లో హిజబ్ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు ఇబ్రహాం రైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల కస్టడీలో మహ్ష అమినీ మరణాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడాన్ని ఆయన ఖండించారు. చట్టాన్ని ఉల్లంఘించి ఆందోళనలు చేపట్టేందుకు ఎవ్వరిని కూడా అనుమతించబోమని అన్నారు.

'అల్లర్లలో పాల్గొన్న వారితో నిర్ణయాత్మకంగా వ్యవహరించాలి, ఇది ప్రజల డిమాండ్' అని రైసీ టెలివిజన్ ఇంటర్వ్యూలో అన్నారు. ప్రజల భద్రతకే తమ దేశం ప్రాధాన్యతను ఇస్తుందని, చట్టాన్ని ఉల్లఘించి.. ఆందోళనలను చేపట్టేందుకు ఎవ్వరిని అనుమంతిచబోమని చెప్పారు. జాతీయ సమైక్యతను లక్ష్యంగా చేసుకుని ప్రజల్లో తగదాలు సృష్టించేందుకు శత్రువు చూస్తున్నారని విమర్శించారు.

అమినీ మరణం పట్ల దేశం శోకంలో మునిగిందని అన్నారు. ఫోరోన్సిక్, జ్యుడిషియరీ నివేదికలు త్వరలోనే వస్తాయని చెప్పారు. అయితే నిరసనలు అల్లర్లకు భిన్నంగా ఉంటాయని అన్నారు. గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున మహిళలు హిజాబ్‌లను కాల్చడమే కాకుండా, తమ జుట్టును కత్తిరించి ఆందోళనలు చేపట్టారు. 22 ఏళ్ల కుర్దీష్ మహిల హిజాబ్ ధరించలేదనే కారణంతో పోలీసుల కస్టడీలో మూడు రోజుల తర్వాత మరణించింది. దీనిపై పెద్ద ఎత్తున దేశంలో దుమారం రేగింది. పోలీసుల కఠినంగా వ్యవహరించడమే ఆమె చావుకు కారణమని విమర్శలు వెల్లువెత్తాయి.

Next Story

Most Viewed