చైనాలో మరో వైరస్ కలకలం

by Disha Web Desk 22 |
చైనాలో మరో వైరస్ కలకలం
X

బీజింగ్: చైనాలో మరో కొత్త వైరస్ భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే కరోనా, మంకీపాక్స్ వైరస్‌లతో ఆందోళన చెందుతుండగా.. మరో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ 35 మందికి సోకినట్లు తైవాన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) సోమవారం వెల్లడించింది. చైనాలోని షాంగ్‌డాంగ్, హెనాన్ రాష్ట్రాల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. ఈ కొత్త వైరస్‌ను 'లాంగ్యా హెనిపా వైరస్ (లే వీ)గా పిలుస్తున్నారు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తికి తీవ్ర జ్వరం, దగ్గు, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. 'ఓ రోగికి తీవ్ర జ్వరం రావడంతో అతని బ్లడ్ శాంపిల్‌కు పరీక్షలు నిర్వహించారు. ఆ రోగి లాంగ్యా హెనిపా వైరస్‌ను గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం విస్తారంగా పరీక్షలు నిర్వహించింది. 35 మందికి లాంగ్యా హెనిపా వైరస్ సోకిందని నిర్ధారణ చేశారు.' అని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడికల్‌లో ఆగస్టు 4న ఒక ఆర్టికల్ ప్రచురితమైంది. ఈ వైరస్ వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీడీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చావ్‌వాంగ్ జెన్ తెలిపారు.


Next Story

Most Viewed