అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 8 మంది మృతి

by Disha Web |
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 8 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని కాలిఫోర్నియా కమ్యూనిటీలో జరిగిన వేరు వేరు కాల్పుల్లో 8 మంది మృతి చెందాగా పలువురు గాయపడ్డారు. హాఫ్ మూన్ బేలోని కాలిఫోర్నియా కమ్యూనిటీలో జరిగిన అనేక కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రగాయలకు గురయ్యారు. మరో ఘటనలో అయోవాలోని డెస్ మోయిన్స్‌లోని యూత్ ఔట్‌రీచ్ సెంటర్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మరణించగా, మూడో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అలాగే సోమవారం మధ్యాహ్నం చికాగో అపార్ట్‌మెంట్‌లో ఇంటిపై దాడి చేయడంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పలువురు నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయారని, అదుపులో లేరని యూఎస్ పోలీసులు తెలిపారు.

..Also Read...

అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు


Next Story