త్వరలో కరోనా కంటే డేంజర్ మహమ్మారి.. ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని WHO చీఫ్ హెచ్చరిక

by Disha Web Desk 12 |
త్వరలో కరోనా కంటే డేంజర్ మహమ్మారి.. ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని WHO చీఫ్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని కుదిపెసిన కరోనా మహమ్మారి నెమ్మదిగా తగ్గిపోతున్న క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ టెడ్రోస్ అధ్నామ్ ఘ్యాబ్రియోసిస్ మరో బాంబు పేల్చాడు. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా కంటే డేంజరస్ మహమ్మారి రాబోతుందని.. దాన్ని ఎదుర్కోవడానికి యావత్ ప్రపంచం సిద్ధంగా ఉండాలని.. ఆయన హెచ్చరికలు చేశారు. కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా కొంత తగ్గుముఖం పట్టాయి. దీంతో కరోనాను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ పరిధి నుంచి తొలగించినా కోవిడ్ ముప్పు ముగిసిపోలేదని ఆయన హెచ్చరించారు.

76వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సందర్భంగా నివేదికను సమర్పించిన డబ్ల్యూహెచ్ఓ చీఫ్.. ‘కోవిడ్-19 గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీకి ముగింపు ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగా ఉన్న కరోనాకు ముగింపు కాదు.. కొత్తగా వైరస్ వ్యాప్తి, మరణాల పెరుగుదలకు కారణమయ్యే మరో వేరియంట్ ముప్పు ఇంకా మిగిలే ఉంది.. ప్రాణాంతకమైన సంభావ్యతతో ఉద్భవించే మరొక మహమ్మారి ముప్పు కూడా పొంచి ఉంది’ అని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed