- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
అల్ షాబాబ్ నేత అబ్దుల్లాహీ హతం..

మొగదీషు: అల్ ఖైదా అనుబంధ సంస్థ ఆల్ షాబాబ్ నేత అబ్దుల్లాహీ యారే హతమయ్యారు. సోమాలియా ప్రభుత్వం సంయుక్తంగా చేసిన వాయు దాడిలో అల్ షాబాబ్ కీలక నేత మరణించినట్లు ప్రకటించింది. ఇతడిపై 3 మిలియన్ యూఎస్ డాలర్ల నజరానా ఉంది. ఈ నెల 1న ఈ దాడి చేసినట్లు పేర్కొంది. అంతర్జాతీయ భద్రత భాగస్వాములతో కలసి, సోమాలి ఆర్మీ చేపట్టిన డ్రోన్ అపరేషన్ లో ఈ దాడి చేసినట్లు పేర్కొంది. హరంక ప్రాంతంలో అబ్దుల్లాహిని హతమార్చినట్లు పేర్కొన్నాయి.
ఈ మేరకు సోమవారం సమాచార మంత్రిత్వ శాఖ పోస్ట్ చేసింది. 'షబాబ్ గ్రూపులోని అత్యంత అపఖ్యాతి పాలైన సభ్యులలో ఒకడు.. గ్రూప్‌కి ప్రధాన బోధకుడు. ఇక లేడు' అని పేర్కొంది. అతని తొలగింపు దేశం నుంచి ముల్లును తొలగించడం వంటిదేనని తెలిపింది. 2012లో యూఎన్ ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ లిస్టులోని ఏడుగురిలో యారే ఒకరు. ఈ మధ్యనే సోమాలియాలో నూతన అధ్యక్షుడిగా హసన్ షేక్ మహ్మద్ ఎన్నికయ్యారు. తాజాగా ఓ హోటల్ లో 30 గంటల పాటు ఉగ్ర ముట్టడి జరిగిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా కీలక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. గత నెలలో యూఎస్ మిలిటరీ బులోబార్డే ప్రాంతంలో జరిపిన గగన తల దాడుల్లో 27 మంది జిహాదీ ఫైటర్లు మరణించినట్లు పేర్కొంది. సోమాలియా ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ దాడి చేసినట్లు యూఎస్ ప్రకటించింది. ఇస్లామిక్ చట్టాల యొక్క కఠినమైన సంస్కరణను సమర్థించే అల్-షబాబ్, మొగడిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 15 సంవత్సరాలు రక్తపాత తిరుగుబాటును నిర్వహించింది. సోమాలియ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆఫ్రికన్ యూనియన్ ఆపరేషన్ ఉన్నప్పటికీ అల్ షాబాద్ శక్తివంతమైనదిగా ఉంది.