Ajit Doval: ఫ్రాన్స్ అధ్యక్షుడితో అజిత్ దోవల్ భేటీ.. ద్వైపాక్షిక సహకారంపై చర్చ!

by vinod kumar |
Ajit Doval: ఫ్రాన్స్ అధ్యక్షుడితో అజిత్ దోవల్ భేటీ.. ద్వైపాక్షిక సహకారంపై చర్చ!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మంగళవారం ఆదేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే వ్యూహాత్మక ప్రాముఖ్యత, ఇరు దేశాల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయడం వంటి వాటిపై డిస్కస్ చేశారు. అనంతరం అజిత్ దోవల్ ఫ్రెంచ్ సాయుధ దళాల మంత్రి సెబాస్టియన్ లెకోర్నుతోనూ సమావేశమయ్యారు. అంతరిక్ష సహకారాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా చర్చలు జరిగినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, భారత నౌకాదళం కోసం 26 రాఫెల్ మెరైన్ జెట్‌లను కొనుగోలు చేయడానికి ప్రస్తుతం ఫ్రాన్స్ ప్రభుత్వంతో భారత్ చర్చలు జరుపుతోంది. ఈ జెట్‌లలో కొన్ని భారత వైమానిక దళంలో ఇప్పటికే సేవల్లో ఉన్నాయి.

Advertisement

Next Story