ఘోర బోటు ప్రమాదం.. 49 మంది మృతి.. 140 మంది మిస్సింగ్..!

by Satheesh |
ఘోర బోటు ప్రమాదం.. 49 మంది మృతి.. 140 మంది మిస్సింగ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: యెమెన్ దేశంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శరణార్థులతో వెళ్తున్న ఓ బోటు సముద్రంలో ప్రమాదానికి గురి అయ్యింది. ఈ ఘటనలో 49 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 140 మంది నీటిలో గల్లంతు అయ్యారు. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 260 మంది శరణార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే అధికారులు, రెస్య్కూ బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. నీటిలో గల్లంతు అయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. బోటు పరిమితికి మించి ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed