ఘోర ప్రమాదం.. 10 మంది మహిళలు దుర్మరణం

by GSrikanth |
ఘోర ప్రమాదం.. 10 మంది మహిళలు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ట్రక్ బోల్తా పది మంది దుర్మరణం చెందారు. మరో 25 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతులంగా మహిళలే అని గుర్తించారు. క్యూబాకు చెందిన వీరంతా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. వలసవాదులతో వెళ్తున్న వాహనం మెక్సికోలో ప్రమాదానికి గురి కావడం ఇది రెండోసారి అని అధికారులు తెలిపారు. కాగా, వలసవాదులు అక్రమంగా అమెరికాలో చొరబడేందుకు కొన్నాళ్లుగా మెక్సికో మార్గాన్ని ఎంచుకోవడం గమనార్హం.

Advertisement

Next Story